రానున్న సార్వత్రిక ఎన్నిక నిర్వహణ లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వొద్దని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ సూ చించారు. బుధవారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ కళావేదికలో ఆర్వోలు, ఏఆర్వోలు, సెక్టోరియల్ అధికారులకు నిర్వహించిన శిక్షణలో జేసీ ఎం.నవీన్ తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో ఎన్నికల అనుభవం ఉన్నవారైనా సరే మనకు తెలిసిన అంశాలను మరొక్కసారి నెమరువేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునన్నారు. ఎటువం టి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నిక ల సామగ్రి పంపిణీ కేంద్రం నుంచి తీసుకోవడం, హోం ఓటింగ్, ఈవీఎంల పనితీరు తదితర అంశాలపై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నా రు. చేసే పనిపై నమ్మకం ఉంటే శత శాతం విజ యం సాధించగలమని స్పష్టం చేశారు. ఎప్పటికప్పు డు ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను తె లుసుకుని, వాటి ప్రకారం ఎన్నికల విధులను నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవ హరించొద్దని హెచ్చరించారు. ఆర్వోలు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లపై పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఈవీఎం నోడల్ అధికారి, జిల్లా ఉపాధి అధికారి కె.సుధ ఈ వీఎం, వీవీ ప్యాట్స్ పనితీరు, బ్యాలెట్ యూనిట్, పేపర్ లోడింగ్, బ్యాటరీ అమరిక తదితర అంశాల ను వివరించారు. డ్వామా పీడీ చిట్టిరాజు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ నిర్వహణ, తదితర అంశాలను వివరించారు. ఈ శిక్షణలో డీఆర్వో ఎం. గణపతిరావు, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, శ్రీకాకుళం, పలాస ఆర్డీవోలు సీహెచ్ రంగయ్య, భర త్ నాయక్, ఆర్వోలు, ఏఆర్వోలు, నోడల్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైన ర్లు మెప్మా పీడీ కిరణ్‌కుమార్, బాలాజీ నాయక్, కె.శేష గిరి, ఎన్నికల డీటీలు, తదితరులు హాజరయ్యారు.