గంజాయి, డ్రగ్స్‌కు రాష్ట్రాన్ని బలిచేస్తారా? మన పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకునే పరమదుర్మార్గులు వీరు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే పిల్లలు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరన్నదే నా బాధ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రావులపాలెంలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతోంది. ఈ వ్యాపారంలో కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పాత్ర ఉంది. మేమొచ్చాక ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తా. మద్య నిషేధం చేస్తానని ఐదేళ్ల క్రితం హామీ ఇచ్చి జగన్ మహిళలను మోసం చేశాడు. నాణ్యత లేని మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాడు. ప్రజాగళం సభల కు ఎక్కడ చూసినా మహా స్పందన. గెలుపు మనదే.. ఆకలి మీద సింహం వేట కోసం ఎలా వేచి చూస్తుందో నేడు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ ఒక జట్టుగా మీ ముందుకొచ్చాం. రాష్ట్రాన్ని దొంగలపరం చేస్తారో.. కాపాడుకుంటారో మీ ఇష్టం అని తెలియజేసారు.