రాష్ట్రంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని అసమర్థ సీఎం ఈ జగన్. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణపైనే పెడతాం అని టీడీపీ అధినేత మాటిచ్చారు. అయన మాట్లాడుతూ.... ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది(జాబు రావాలంటే బాబు రావాలని జనం నినదించారు). నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి ఇస్తాం. రైతులను ఆదుకుంటాం. విద్యుత్ చార్జీలు పెంచం. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు వంతున ఇస్తాం. మహిళలకు ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఈ 40 రోజులూ మీరు కష్టించాలి. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలో టీడీపీ కూటమి అభ్యర్ధులను గెలిపించాలి. జగన్ జైలుకు పోతాడో.. ఆస్పత్రికి వెళ్తాడో ఇంకా తెలియదు. సైకో పోవాలని అందరూ అంటున్నారు. ఈ ఐదేళ్లలో ఎవరినీ ప్రశాంతంగా బతకనివ్వలేదు. నాకు గోదావరి జిల్లాలంటే ఇష్టం. ఈ ప్రాంతంలో రెడ్లు కూడా ఉన్నారు. వారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో పనులు చేశారు. వారెవరికైనా బిల్లులు వచ్చాయా? ఆక్వా రంగం కుదేలైంది. జగన్ విధానాలతో మేత, విద్యుత్ రేట్లు పెరిగాయి. మేమొచ్చాక ఈ రంగానికి రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తాం. నా బీసీలంటూ 30 పథకాలను నిలిపివేశారు. కోనసీమ జిల్లాలో అంబేడ్కర్‌కే అవమానం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ అనంతబాబు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఏమయ్యాయి? కాపులకు జగన్‌రెడ్డి ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగింది. వారి కోసం ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తానన్నాడు. చేశాడా? కనీసం పది కోట్లయినా ఇచ్చాడా? నేను అఽధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి రూ.1,000 కోట్లు కేటాయించాను. కాపుల్లో పేద వర్గాలకు న్యాయం చేసింది మేమే. మాదిగలకు న్యాయం చేసేలా ఆ సామాజికవర్గానికి ఎమ్మెల్సీ ఇస్తాం. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి పొలిట్‌బ్యూరో పదవి ఇచ్చాం అని తెలిపారు.