పుత్తూరు తిరుపతి హైవే అంజీరమ్మ గుడి వద్ద గురువారం ఎలక్ట్రికల్ బైక్ దగ్ధమైంది. స్థానికుల వివరాల మేరకు పుత్తూరు నుండి ఎలక్ట్రికల్ బైక్ పై తిరుపతికి వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు ఒక్కసారి బైక్ నుంచి పొగలు రావడంతో గమనించి బైక్ ఆపి దూరంగా వెళ్లిపోయాడు. కాసేపటికి బైక్ నుంచి మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.