ఎమ్మెల్యే కొడాలి నానికి నిరసన సెగ తగిలింది. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్మాన్ పేటలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే కొడాలి నానిని స్థానికులు నిలదీశారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. ఐదు నెలలుగా తాగు నీరు రావడం లేదంటూ నానిని మహిళలు ప్రశ్నించారు. అలాగే తమకు ఇళ్ల పట్టాలు కూడా రాలేదంటూ పేర్కొన్నారు. దాంతో ఇళ్ల పట్టాలు వచ్చే ఏర్పాటు చేస్తానని కొడాలి నాని హామీ ఇచ్చి వెళ్లిపోయారు.