కొవ్వూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం జయహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అనంతరం ఆయన సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు.