ఎన్నో ఆటంకాలు, అనేక వివాదాలు నడుమే ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. పెన్షన్ల పంపిణీ విషయంలో అధికారపార్టీ, టీడీపీ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని టీడీపీ ఆరోపిస్తుండగా.. పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి కారణం తెలుగుదేశం పార్టీనే అంటూ వైసీపీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. పెన్షన్ల పంపిణీపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఈసీ నేరుగా సమాచారం సేకరిస్తోంది. పలు జిల్లాలలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం వివరాలు తీసుకుంది. కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ల ద్వారా పెన్షన్‌ల పంపిణీ జరుగుతున్న తీరుపై ఈసీ వివరాల సేకరించే పనిలో పడింది. జిల్లాల వారీగా సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అబ్జర్వర్లు పంపిస్తున్నారు. పెన్షన్‌లపై నెలకొన్న వివాదం, ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.