పలమనేరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ కోర్ సమావేశం గురువారం జరిగింది. ఇందులో భాగంగా పలమనేరు ప్రకృతి కన్వీనర్ మల్లిచెట్ల దేవేంద్ర, పలమనేరు మండల విద్యాశాఖ అధికారి లీలారాణి, ఎన్జీసి కోఆర్డినేటర్లు బాలచైతన్య, ప్రతాప్, పాఠశాల ప్రధానోపాధ్యా యులు పాఠశాలలో కొన్ని మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ కాలుష్యం తగ్గించి మొక్కలను పెంచడమే భవిష్యత్ తరాలకు మనమిచ్చే బహుమతి అన్నారు.