కరోనా కంటే ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ మానవాళిపై విరుచుకుపడే ప్రమాదం ఉన్నదని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బర్డ్‌ఫ్లూలోని హెచ్5ఎన్1 రకం వైరస్ మహమ్మారిగా మారవచ్చని పేర్కొన్నారు. కెనడాకు చెందిన ఫార్మారంగ నిపుణులు జాన్ ఫౌల్టన్ కూడా బర్డ్‌ఫ్లూపై ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్5ఎన్1 వేరియంట్ మహమ్మారిగా మారవచ్చని, ఇది కొవిడ్-19 కంటే 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని తెలిపారు.