నెల్లూరు నా కర్మ భూమి. ఇక్కడే పుట్టా. చదువుకున్నదీ ఇక్కడే. ఈ ప్రాంత అభివృద్ధి నా బాధ్యత అని నెల్లూరు పార్లమెంట్ వైయస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాకు పెన్నమ్మ జలరాశులు ఒక వరం. సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. సముద్ర తీరం ఉంది. ఓడరేవు, పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తా. పని చేయగలిగే వయసులో ఉన్న ప్రతి యువతీ, యువకుడికి ఉద్యోగావకాశాలు కల్పిస్తా. నెల్లూరు నగరాన్ని మోడల్ సిటీగా మారుస్తా అంటూ సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు.