సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కారంచేడు మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. కేంద్ర బలగాలతో పాటు కారంచేడు పోలీసులు కూడా ఈ కవాతులో పాల్గొన్నారు. ఓటర్లకు పోలీసు యంత్రాంగం అండగా ఉంటుందని ధైర్యం చెప్పేందుకే ఈ కవాతు నిర్వహించినట్లు ఇంకొల్లు సీఐ బి. శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. సమస్య ఉంటే పోలీసులకు చెప్పాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa