శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ఠ్. నేటి నుండి శ్రీశైలంలో 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఇక నేటి ఉదయం శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలు శ్రీకారం ఉంటుంది.ఇవాళ సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు భ్రమరాంబికాదేవి. సాయంకాలం బృంగివహంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకొనున్నారు ఆది దంపతులు. ఇక ఇవాళ రాత్రి క్షేత్రపురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారు గ్రామోత్సవం ఉంటుంది. అయితే.. నేటి నుండి శ్రీశైలంలో 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు జరుగనున్న తరుణంలోనే.. వేలాది భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు.