దేశంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ముంబైలోని అధికారులు అక్కడి ఆస్పత్రులలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. నగరంలోని 14 ప్రధాన ఆస్పత్రులలో, మెడికల్ కాలేజీలలో హీట్ స్ట్రోక్ (వడదెబ్బ) రోగులకు చికిత్స చేయడానికి కోల్డ్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు ముంబై పౌర సంఘం తెలిపింది. అలాగే వడదెబ్బకు గురైన వారికి మెరుగైన చికిత్స అందించేలా కోల్డ్‌రూమ్‌లోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది.