రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కోరారు. తాడిపత్రి పట్టణంలోని 34వ వార్డులో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. తాడిపత్రిలో అభివృద్ధి ఎమ్మెల్యే పెద్దా రెడ్డితోనే సాధ్యమన్నారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందామన్నారు.