చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్‌లు తీసుకుంటున్నారు. మీ యూటర్న్‌ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి?. అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి అని నిలదీశారు. వైయస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు ఉచ్చులో, కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కకున్నారని విమర్శించారు. హంతకుడు అంటూ వైయస్ అవినాష్‌రెడ్డిపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిలకు కోర్టుల మీద, వ్యవస్థల మీద నమ్మకం లేదా అంటూ ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్యలో జరుగుతున్న రాజకీయాలను కడప ప్రజలు గమనిస్తున్నారన్నారు.