వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. అక్రమ దారిలో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. అక్రమార్జన సొమ్మును విదేశాల్లో దాచుకుంటున్నారని విమర్శించారు. నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్న ఆమె వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న మిస్బ కుటుంబాన్ని పరామర్శించారు. నంద్యాల అంటే తనకు జ్ఞానాపురం నుంచి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన విధానమే గుర్తుకొస్తుందన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని కానీ అక్రమంగా ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వేధింపులతో షేక్ అబ్ధుల్ సలాం కుటుంబం సూసైడ్ చేసుకున్న ఘటనను తాను మరిచిపోలేదని తెలిపారు.