పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామంలో ఆదివారం బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ముచ్చుకోట గ్రామానికి చెందిన కంబగిరి తన కుమార్తె కస్తూరి, కుమారుడు కల్యాణ్ తో కలసి ద్విచక్ర వాహనం పై తాడిపత్రి నుంచి ముచ్చుకోటకు వస్తున్నారు. గ్రామ సమీపంలో అరటి తోటలో లోడ్ చేసుకొని రహదారిపైకి వస్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.