తాడిపత్రి పట్టణంలోని జయనగర్ కాలనీలో ఉన్న ఓ బట్టల షాపులో 12 చీరలు దొంగతనం చేసిన ఐదుగురు మహిళలను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. షాపు ఓనర్ కిషోర్ కుమార్ రెడ్డిని మహిళలు చీరలు కొనడానికి వచ్చినట్లు వచ్చి ఓనర్ ను డైవర్ట్ చేసి 12చీరలను ఎత్తుకొని వెళ్లారు. ఇది గమనించిన ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలం లోని సీసీ కెమెరాలను పరిశీలించి కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన ఐదు మంది మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 12 చీరలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు.