రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన పురాతన జంబుకేశ్వర స్వామి శివాలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా పురోహితులు రామకృష్ణ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు నేడు నీలం పూసలతో నీలకంఠేశ్వరుడు అలంకరణలో భక్తులకు కనివిందు చేశాడు. అంతకుముందు స్వామివారికి పంచామృత, కుంకుమార్చనలు, రుద్ర కవచ అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.