టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని అనంతపురము ఎంపి అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం గుంతకల్లుకు వచ్చిన ఆయన వైకాపా నాయకుడు ముస్టూరు భాస్కర్ స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందన్నారు.