ధర్మవరం మండలం సుబ్బారావుపేటలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ధర్మవరం ఆర్టీసీ డిపో కండక్టర్ వెంకటరమణారెడ్డిని శనివారం డీఎం సత్యనారాయణరావు సస్పెండ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ధర్మవరం డీఎంకు ఆదేశాలు ఇవ్వడంతో కండక్టర్ ను సస్పెండ్ చేశారు.