వేంపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్వద్ద ఉన్న కాజా హుస్సేన్ కు సంబంధించిన ఇల్లు సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో రూ. 2 లక్షల వరకు నష్టం వాటిలిందని బాధితుడు వాపోయాడు. జీవనోపాధి కోసం కాజా హుస్సేన్ కొలిమి పెట్టుకుని జీవనం సాగించేవాడు. ఇంటికి నిప్పు పెట్టడంతో అందులోని చెక్క సామగ్రి మొత్తం కాలిపోయాయి. ఫైర్ అధికారులు వచ్చి మంటలను ఆర్పి వేసిన అప్పటికే కలప మొత్తం కాలిపోయింది.