విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో పాదచారుల వంతెన కుంగింది. ఉదయం స్టేషన్‌లోని 3, 4 ప్లాట్‌ఫాంల నుంచి వచ్చే ప్రయాణికులు గేట్ నంబర్ 3 వైపునకు దీని మీదుగానే వెళ్తుంటారు. ఈ వంతెనపై నుంచి రోజూ జనాలు నడుస్తూనే ఉంటారు.. అయితే ఇప్పుడు కూలిపోయే స్థితికి చేరుకుంది. దీంతో ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కుంగిన సమయంలో వంతెన తాకడంతో కింద ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో అప్పటికే ప్లాట్‌ఫాంపైకి వస్తున్న వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఆ వెంటనే స్పందించిన రైల్వే అధికారులు వైర్లను సరిచేయగా.. రైలు కదిలి వెళ్లిపోయింది. రైల్వే అధికారులు వంతెన కూలిపోక ముందే అప్రమత్తమై.. మరమ్మత్తులకు సిద్ధమయ్యారు.