ముద్దనూరు రోడ్డులో మట్కా స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్సైసుబ్బారావు తెలిపారు. మంగళవారం మట్కా ఆడుతున్నట్లు ముందస్తు సమాచారంతో దాడి చేశామన్నారు. ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 14, 350 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. మట్కా నిర్వహణకు ఉపయోగించిన పేపర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.