వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతోంది. బుధవారం ఉదయం పల్నాడు జిల్లా గంటావారిపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. గంటావారిపాలెం జనసంద్రంగా మారింది. దారిపొడవునా భారీగజమాలతో ముఖ్యమంత్రికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. మేమంతా సిద్ధమంటూ... ముఖ్యమంత్రి బస్సుతో పాటు జనప్రవాహం కదిలింది. ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు విద్యార్దులు, యువతీయువకులు, చిన్నారులతో సహా తల్లులు, అవ్వాతాతలు దారిపొడవునా సంఘీభావం తెలిపారు.ఇవాళ పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్ విప్పెర్ల, నకరికల్లు దేవరంపాడు క్రాస్‌కు బస్సు య్రాత. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా అయ్యప్పనగర్ బైపాస్‌కు చేరకొనున్న బస్సు యాత్ర. అయ్యప్పనగర్ బైపాస్ వద్ద ‘మేమంతా సిద్ధం’బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైయస్ జగన్. అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్లకు చేరుకోనున్న బస్సు యాత్ర. రాత్రికి ధూళిపాళ్లలో సీఎం వైయస్ జగన్ బస చేస్తారు.