టెక్కలి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిల్లి కృపారాణి పోటీ చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం మరో 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేయగా కృపారాణి పేరు అందులో ఖరారైంది. వైసీపీని వీడిన ఆమె ఇటీవలే వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం తెలిసిందే. ఇప్పటివరకు టెక్కలి టికెట్ ఆశించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోత మధుసూదన రావుకి ఆశాభంగం అయింది.