శ్రీకాకుళం జిల్లా అంటే చంద్రబాబుకు చిన్న చూపు అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చల్లపేటలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్నినిర్వహించారు. జలుమూరు, సారవకోట మండలాలకు చెందిన వైయస్ఆర్‌సీపీ శ్రేణులతో ఈ సమావేశ ప్రాంగణం కళకళలాడింది. సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబుకు మన శ్రీకాకుళం జిల్లా అంటే ఎప్పుడూ చిన్నచూపే. ఆయన ఇంత కాలం అనుకూల మీడియాతో పబ్బం గడుపుకున్నారు. ఆ రోజు విభజనలో భాగంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు పరిహారంగా 23 సంస్థలు కేంద్రం కేటాయిస్తే,ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ శ్రీకాకుళంలో చంద్రబాబు నెలకొల్పలేదు. శ్రీకాకుళం పౌరుల కోసం ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. కానీ యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇందుకు భిన్నంగా ఉన్నారు. మన ప్రాంతంపై ప్రేమతో ఉన్నారు. మన ప్రాంత ప్రజల సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో పరిష్కరించారు.