ఎంపీగా మచిలీ పట్నం పోర్టు నిర్మాణానికి నిధులు తెచ్చానని, నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, పోర్టు నిర్మాణం పూర్తయితే యువకులకు ఉద్యోగాలు, ఉపాధి దొరుకు తాయని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. కూటమి అభ్య ర్థులకు ఓట్లువేసి గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కూటమి పెనమలూరు అభ్యర్థి బోడె ప్రసాద్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఆయన కాటూరులో పర్యటించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీలు వంటి మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రకటించిన ఆరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజేంద్రప్రసాద్ వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి తప్ప అభిృద్ధి లేదని కొనకళ్ల నారాయణ అన్నారు. టీడీపీ నాయకులు యెనిగళ్ల కుటుంబరావు, కాటూరి శరత్‌బాబు, వెంకటనారాయణ, వేమూరి శ్రీనివాసరావు, కాకాని శ్రీనివాసరావు, యుగబాబు, ప్రవీణ్, దండమూడి చౌదరి, హరీశ్, జనసేన నాయకులు ముప్పా రాజా, ఆదినారాయణ, శివప్రసాద్ పాల్గొన్నారు.