పెద్దవడుగూరు మండలంలోని చిత్రచేడు గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరి పిల్లల సహా అదృశ్యమైనట్లు ఆమె తండ్రి నరసింహులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో చర్చికి వెళ్తున్నాని చెప్పి తన ఇద్దరు పిల్లలు దినేష్ కుమార్, సౌజన్యతో ఇంటి నుంచి వెళ్ళింది. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఫిర్యాదు చేశారని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. బాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
![]() |
![]() |