పెద్దపప్పూరు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-2 వద్ద అదుపు తప్పి ఆదివారం ఆటో బోల్తా పడింది. చాగల్లు గ్రామానికి చెందిన ఓబులేశు వ్యక్తిగత పనులు ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా ఆటో అదుపు తప్పి ప్రధాన రహదారి నుంచి పొలాల్లోకి పల్టీ కొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న ఓబులేసు కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108లో పెద్దపప్పూరు ఆస్పత్రికి తరలించారు.
![]() |
![]() |