తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో కుటుంబ కలహాలతో రమేష్ (32) ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వివరాల మేరకు గ్రామానికి చెందిన రమేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసైన అతడు రోజూ కుటుంబసభ్యులతో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.