శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా హిందూపురం మండలం కొల్లకుంటకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వడ్డే అంజినప్పను నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీలో గత కొంతకాలంగా క్రియాశీలకంగా పనిచేసిన అంజినప్పకు ఎమ్మెల్యే బాలకృష్ణ ఆశీస్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా స్థాయి పదవీ ఆయనకు వరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. పార్టీ బలోపేతం చేస్తానని అంజినప్ప తెలిపారు.
![]() |
![]() |