తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒకట్రెండు రోజుల్లో నేపాలీస్ సహా ఐదు భాషల్లో మ్యానిఫెస్టోను విడుదల చేయబోతోంది. పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్.. బెంగాలీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌తో పాటు సంతాలీ భాష ఓల్చికిలో తమ ఎన్నికల ప్రణాళికను వెలువరించనుంది. మరోపక్క పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ DIGని తొలగించాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనల నిరోధానికి ఆయన తక్షణ చర్యలు తీసుకోలేదని పేర్కొంది.