శిరోముండనం కేసులో జైలుశిక్ష పడిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్ మంజూరైంది. 28 ఏళ్ల క్రితం రామచంద్రాపురం మండలం (ప్రస్తుతం కోనసీమ జిల్లా) వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను చిత్రహింసలకు గురిచేసి వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై కేసు నమోదైంది. 1996 నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. శిరోముండనం కేసులో నిందితులకు ఇవాళ విశాఖపట్నం కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితుల్లో ఒకరైన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.