సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి ఈనెల 18వ తేదీన అంటే గురువారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 18వ తేదీ నుంచి 25వతేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు వీలుంటుంది. అనంతరం గుర్తుల కేటాయింపు జరుగుతుంది. పోటీలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa