కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ ఈ నెల 25వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు శుక్రవారం వైసీపీ కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కనిగిరిలోని స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో గురువారం ఉదయం 9 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. దద్దాల నారాయణ యాదవ్ ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa