కనిగిరి పట్టణంలోని స్థానిక 20వ వార్డులో శుక్రవారం కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ సతీమణి మంజు భార్గవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో కనిగిరి ఎమ్మెల్యేగా దద్దాల నారాయణ యాదవ్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ కఫార్, మాజీ ఏఎంసీ చైర్మన్ వై సరిత రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ మెన్ పులి శాంతి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa