వెలిగండ్ల మండలం హుస్సేన్ పురం గ్రామానికి చెందిన 35 కుటుంబాలు శుక్రవారం టిడిపిని వీడి వైసీపీలో చేరారు. కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ వారందరికీ వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పాలన సాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అందుకే వైసీపీలో చేరికలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు.