పామూరు పట్టణంలోని 3, 4వ సచివాలయం పరిధిలోని నలుగురు వాలంటీర్లు శుక్రవారం తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వారి రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో పల్లెల పుట్టారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని, జగనన్నను మరల సీఎం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.