నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు రాజకీయ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. చంద్రబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా, పరిపాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు నిరంతం రాష్ట్రం గురించే ఆలోచన చేస్తారన్నారు.రాజకీయ ఒత్తిళ్ళు, వేధింపులు ఎన్ని ఎదురైనా ధృడ చిత్తంతో చంద్రబాబు ఎదుర్కొంటారని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ సర్కార్ బనాయించిన కేసులతో కారాగారంలో ఉన్నప్పుడూ కూడా ఆయన మనో నిబ్బరం కోల్పోలేదని పేర్కొన్నారు. పరిపాలనా పటిమతో రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.
![]() |
![]() |