కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో యూపీకి చెందిన సచిన్ మీనా, పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌లకు పబ్‌జీలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. అయితే, సీమాకు అప్పటికే వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. కానీ, ప్రియుడి కోసం ఆమె గతేడాది మార్చిలో కరాచీ నుంచి బయలుదేరి దుబాయ్ మీదుగా నేపాల్‌కు చేరుకుంది. సచిన్, సీమా మొదటిసారి ప్రత్యక్షంగా నేపాల్‌లోనే కలుసుకున్నారు. అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు.