చంద్రబాబు ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి అంటూ వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయన్ను నమ్మి టీడీపీకి ఓట్లేస్తే మీ మత విశ్వాసాల్ని దెబ్బతీసుకున్నట్టే అన్నారు. మతతత్వ బీజేపీతో జతకట్టిన ఆయన యూనిఫాం సివిల్ కోడ్‌కు అనుకూలమా..? వ్యతిరేకమా..?. 24 గంటల్లోగా దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి నిన్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి. విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలోకి చేరారు.