ప్రజలకు మంచి చేసి తాను ఒక్కడినే ఎన్నికలకు వస్తుంటే 75 ఏళ్ల వయసులో పది మందిని పోగేసుకుని ఎందుకు వస్తున్నావని చంద్రబాబును సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. సింగిల్‌గా వస్తున్న తనను ఎదుర్కొనేందుకు బాబుకు ఎందుకు భయమో చెప్పాలన్నారు. ఒక్కే ఒక్కడిని ఎదుర్కొనేందుకు నక్కలన్నీ కలిసి వస్తున్నాయన్నారు. తాను బచ్చా అయితే తన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నిన్ను ఏమనాలని చంద్రబాబును ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అందరూ తన చుట్టూ బాణాలు పట్టుకుని నిలుచున్నారన్నారు.‘ఇంటింటికి జరిగిన మంచిని కొనసాచించాలని పెత్తందార్ల మీద యుద్ధం కొనగించడానికి వచ్చిన ప్రజా సైన్యమిది. మూడు వారాల్లో జరగబోతున్న ఈ ఎన్నికలు ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా గుర్తుండిపోతాయి. ఈ ఎన్నికలు పేదలు, రైతులు, పిల్లలు, అక్క,చెల్లెమ్మలు, అవ్వాతాతలు, పేద సామాజికవర్గాల వారి ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మంచి చేసి మనకు, మోసాలు, కుట్రలతో వచ్చే వారికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఇంటికి మంచి చేసి మనం, ప్రతి వర్గానికి మోసం చేసి వారు ఎన్నికల కోసం మళ్లీ భ్రమలు కల్పిస్తున్నారు. మళ్లీ మోసానికి దిగుతున్న ఈ అన్యాయస్తులను ఓడించేందుకు సిద్ధం కావాలి. జగన్‌ను ఓడించాలని వారు, పేదలను గెలిపించాలనే మా మధ్య జరిగే 2024 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి మన ఈ సిద్ధం సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయి. ఉక్రోశం, కడుపు మంటతో చంద్రబాబు తన మీద రాళ్లు వేయమంటున్నాడు. నా మీద యుద్ధం చేయమంటున్నాడు. ఇది చంద్రబాబు, దత్తపుత్రుడు వాళ్ల వదినమ్మల ఎజెండా. రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది దాచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలట. ఈ మధ్య బాబు జగన్ ఒక బచ్చా అంటున్నాడు. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, పూతన రాముడిని బచ్చా అనుకున్న మారీచుడు లాంటి వాళ్లు... రామోజీ, రాధాకృష్ణలు. విలన్లకు హీరోలు బచ్చాల్లాగే కనిపిస్తారు’ అని సీఎం వైయస్ జగన్ అన్నారు.