అనంతపురం మండలంలోని క్రిష్ణంరెడ్డిపల్లి గ్రామంలో వనభోజనోత్సవాన్ని నిర్వహించారు. శ్రీరామనవమి అనంతరం ఏటా వనభోజ నోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. శనివారం గ్రామస్థులు ఉదయం గ్రామ సమీపంలోని చింత వనంలోకి వెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆటపాటలతో గడిపారు. చెట్లకు ఊయలలు వేసుకొని... సందండి చేశారు. సహపంక్తి భోజనాలు చేశారు. సాయంత్రం గ్రామ దేవుడైనా నెట్టికంటి ఆంజనేయస్వామి గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగిస్తూ... ఇళ్లకు చేరుకున్నారు.
![]() |
![]() |