పార్టీకోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం పెద్దవడుగూరు మండలకేంద్రంలో నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో జేసీపీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపుకు శ్రమించాలన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కన్వీనర్ కొండూరు కేశవరెడ్డి, నాయకులు సూర్యనారాయణరెడ్డి, గంగరాజుయాదవ్, హరినాథ్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, నాగరాజు, చిరంజీవులు, శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
![]() |