ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదివారం నంద్యాలకు వస్తున్నట్లు నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్ తెలిపారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏపీ న్యాయయాత్ర పేరుతో వైఎస్ షర్మిల బస్సు యాత్ర నిరవహిస్తున్నారని చెప్పారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణ కొట్కూరు నుంచి సాయంత్ర 4 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుందని తెలిపారు. రోడ్ షో నందికొట్కూరులోని పటేల్ సెంటర్ వరకు చేరుకుంటుందని, అక్కడే బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసంగిస్తారని తెలిపారు. పటేల్ సెంటర్‌లో బహిరంగ సభ అనంతరం మిడుతూరు, గడివేముల మీదుగా నంద్యాలకు రాత్రి 7 గంటలకు చేరుకున్నట్లు తెలిపారు. శ్రీనివాససెంటర్ నుంచి గాంధీచౌక్ వరకు రోడ్‌షో, బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. షర్మిల పర్యటనను జయప్రదం చేయాలని లక్ష్మీనరసింహ యాదవ్ పిలుపునిచ్చారు.
![]() |
![]() |