ధర్మవరం పట్టణానికి త్రాగునీటిని సరఫరా చేసే పైపులైన్లు పగిలిపోవడంతో రెండు రోజులుగా తాగునీరు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ధర్మవరం మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు ఆదివారం స్వయంగా తంబాపురం పంపు హౌస్ వద్దకు వెళ్లి పైపుల మరమ్మతు పనులను చేపట్టారు. వీలయినంత త్వరగా తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని కమిషనర్ తెలిపాడు.