దేవినేని ఉమతో తనకు ఎలాంటి విబేధాలు లేదని వసంత కృష్ణ ప్రస్తాద్ అన్నారు. దేవినేని ఉమను కలిసి రేపు తన నామినేషన్‌కు రావాలని ఆహ్వానించాని చెప్పారు. ‘‘నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలు నాకు అండగా నిలిచారు. టీడీపీ అంటేనే నిబద్ధతతో ఉన్న కార్యకర్తల పార్టీ. ఉమతో నాకు ఎటువంటి బేధాలు లేవు. రాజకీయ పరమైన విబేధాలే గతంలొ ఉండేవి. వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదు. ఇందుకు జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వకపోవడమే కారణం. చంద్రబాబు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతా. దేవినేని ఉమ టీడీపీ కోసం ఎంతో పని చేశారు. భవిష్యత్తులో ఆయనకు మంచి గుర్తింపు, ప్రాధాన్యత తప్పకుండా ఉంటాయి’’ అని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. కాగా టీడీపీ సీనియర్ లీడర్ అయిన దేవినేని ఉమామహేశ్వర రావుని పక్కన పెట్టిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు పార్టీ అధినేత చంద్రబాబు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉమ అలకబూనారు. చంద్రబాబు బుజ్జగించడంతో ఆయన దారికొచ్చారు. తాజాగా వీరిద్దరూ చేతులు కలపడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.