రాజమండ్రి రూరల్ కడియంలో ఒక పెళ్లి ఘనంగా జరుగుతోంది. బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక కాసేపట్లోనే పెళ్లి జరగబోతుందనగా.. కొందరు దుండగులు ఒక్కసారిగా మండపంలోకి దూరారు. మొదట్లో ప్రేమగా మాట్లాడుతూ లోనికి వచ్చారు. సరిగ్గా పీటల దగ్గరికి చేరుకున్నాక ఆ దుండగులు ఒక్కసారిగా చెలరేగిపోయారు. అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు చుట్టూ ఉన్న బంధుమిత్రులు, అతిథుల కళ్లపై కారం చల్లారు. అక్కడి నుంచి పెళ్లికూతురిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. అమ్మాయి తరఫు వ్యక్తులు కూడా గట్టిగానే ప్రతిఘటించారు. అమ్మాయిని తీసుకెళ్లనివ్వకుండా వారిని అడ్డుకున్నారు. ఆ దుండగుల నుంచి ఆమెని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటికీ ఆగని దుండగులు.. తమకు అడ్డుగా వస్తున్న వాళ్లపై కంట్లో కారం కొడుతూ కనిపించారు. అయితే.. ఆ దుండగులు అమ్మాయిని తీసుకెళ్లారా? లేదా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే.. పెళ్లికూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఆ దుండగులు ఎవరు? అసలు ఎందుకు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు? అనే డీటెయిల్స్ కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. బహుశా.. ఈ కిడ్నాప్ యత్నం వెనుక ‘ప్రేమ’ వ్యవహారం ఉండొచ్చేమోనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa