పదో తరగతి పరీక్షల ఫలితాల్లో రాష్ట్రంలో 86.69 ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 6,16,615 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకాగా వారిలో 5,34,574 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. 2023లో 72.74ు మంది ఉత్తీర్ణులైతే, ఈసారి 13.95శాతం పెరిగింది. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురే్‌షకుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి సోమవారం విజయవాడలో విడుదల చేశారు. టెన్త్ పరీక్షలకు మొత్తం 6,23, 128 మంది నమోదు చేసుకోగా 6,16,615 మంది రాశారు. అబ్బాయిలు 3,14,610 మంది పరీక్షలు రాస్తే 2,65,267 మంది(84.32శాతం) పాసయ్యారు. అమ్మాయిలు 3,02,005 మందికి గాను 2,69,307 మంది (89.17ు) మంది ఉత్తీర్ణులయ్యారు. 2803 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 17 పాఠశాలల్లో విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 69.26శాతం మంది ఫస్ట్ డివిజన్‌లో, 11.87శాతం మంది సెకెండ్ డివిజన్‌లో, 5.56ు మంది థర్డ్ డివిజన్‌లో ఉత్తీర్ణత పొందారు. జిల్లాల వారీ గా చూస్తే 96.37శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానం లో ఉంటే, 62.47శాతంతో కర్నూలు అట్టగున నిలిచింది. మన్యం జిల్లా వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.